Followers

ఉచితంగా 20 టన్నుల బ్లీచింగ్ పంపిణీ

ఉచితంగా 20 టన్నుల బ్లీచింగ్ పంపిణీ     

పెన్ పవర్, కందుకూరు

 కందుకూరు నియోజకవర్గంలో కరోనా రెండో దశలో విజృంభిస్తున్న తరుణంలో కందుకూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు, మున్సిపాలిటీకి బ్లీచింగ్, సున్నం పంపిణీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్  రెడ్డి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సాటి మనుషులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారం అందించే భావన తపన, ప్రతి ఒక్క మనిషి లో ఉండాలి అని అన్నారు. కందుకూరు పట్టణం లో 14వ వార్డు కు చెందిన మాధవ పేదవాడు అయినప్పటికీ మంచి మనసుతో, సేవా దృక్పథంతో 50 వేల రూపాయలతో 21 టన్నుల సున్నాన్ని కందుకూరు మున్సిపాలిటీ అందజేశారు. ఈ సందర్భంగా మాధవ కి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం  మండలాల వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థుల అందరూ కలిసి 20 టన్నుల బ్లీచింగ్ ను అందజేశారని అన్నారు. ఇప్పటికే 20 టన్నుల బ్లీచింగ్ ను,  సున్నాన్ని ఉచితంగా అందజేశామని అన్నారు. ఇక నుంచి వచ్చే బ్లీచింగ్ పంచాయితీలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అని అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు  3500 జతల గ్లౌజులు, 150 లీటర్ల శానిటైజర్ ను, ఐదువేల మాస్కులను ప్రభుత్వం ఇచ్చేవి కాకుండా అదనంగా  అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్నీ ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు మాస్కులు, మెడికల్ కిట్లు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఆఫీస్ కి వచ్చి ఉన్నాయని వాటిని రేపు అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు  అందజేస్తామని అన్నారు.


 కరోనా వచ్చిన పేషెంట్లు ఎవరు దయచేసి బయటకు రావద్దుని ప్రభుత్వ డాక్టర్లు  ఇచ్చిన సూచనలు సలహాల మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ ప్రభుత్వం వారిచ్చిన మందులు వాడుకుంటూ ఉండాలని అలా కాకుండా వారు బయటకు వచ్చి వారి ద్వారా జబ్బును మరింత మందికి వ్యాప్తి చేసి సమాజానికి నష్టపరిచే కార్యక్రమం చేయవద్దని వారిని కోరారు. కందుకూరు పట్టణం లో సుమారు 14 మంది, పల్లెటూర్లలో పదిమంది వరకు  మరణించారని, ఎటువంటి అవసరం లేకుండా పల్లెటూర్ల నుంచి కందుకూరు కి రావద్దని అన్నారు. పల్లెటూర్లో కూడా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా ని దరిచేరకుండా చూసుకోవాలి అని అన్నారు.ఇప్పటికే జరగాల్సిన నష్టం 30శాతం జరిగిపోయిందని ఇప్పటినుంచైనా 15 రోజుల వరకూ జాగ్రత్తగా ఉంటే కొంతవరకు కరోనా ని కట్టడి చేయవచ్చు అని అన్నారు. ఒంగోలు రిమ్స్ హాస్పటల్లో సామర్థ్యాన్ని రెట్టింపు చేసినా, అంబులెన్స్లోవేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే ఎంత డబ్బులు ఇచ్చినా బెడ్ దొరకట్లేదు అని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఇది గమనించి అనవసరంగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ కరోనా ను కట్టడి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, కందుకూరు, వలేటివారిపాలెం, లింగాసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు మండలాల ఎంపిడివో లు విజయ శేఖర్, రఫీక్ అహ్మద్, మాలకొండయ్య,. వెంకటేశ్వర్లు, రవి కుమార్ తదిరులు పాల్గొన్నారు.

మీ సేవలు చిరస్మరణీయం

 మీ సేవలు చిరస్మరణీయం

మునగపాక, పెన్ పవర్

మునగపాక పోలీసు స్టేషన్ లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన అదనపు ఎస్.ఐ.బి.గురునాథ్ ను జిల్లా ఎస్.పి, బి.కృష్ణారావు ఐ.పి.ఎస్., తమ కార్యాలయములో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

విధుల్లో చేరిన నాటి కాలంలో అప్పటి స్థితిగతులను నిలదొక్కుకుంటూ కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వర్తించడం సాధారణ విషయం కాదన్నారు. పదవి విరమణ తరువాత  కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను నేరుగా సంప్రదించ వచ్చునని  సూచించారు.ఈ కార్యక్రమంలో  ఏ.ఆర్ డి.ఎస్.పి  ఆర్.పి.ఎల్.శాంతి కుమార్,పదవీ విరమణ పొందిన ఎస్సై కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లాక్ డౌన్ పెట్టండి లేదా 144 సెక్షన్ ను కఠినంగా అమలుచేయండి

లాక్ డౌన్ పెట్టండి లేదా 144 సెక్షన్ ను కఠినంగా అమలుచేయండి 

విజయనగరం, పెన్ పవర్

జిల్లాలో తక్షణమే లాక్ డౌన్ విధించండి లేదా 144 సెక్షన్ ను కఠినంగా అమలు చేయాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణరావు(బాలు) శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికాప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా మహమ్మారి  రెండోవేవ్ లో ప్రపంచ దేశాలతోపాటు మన జిల్లా ప్రజలకు కరోనా కేసులు వెలకొద్ది పెరగడం, ఓపక్క ఎక్కువ మరణాలు సంభవించడం ప్రజలను భయబ్రాంతులకు గురుచేస్తుస్తున్నాయని ఇటువంటి తరుణంలో రాత్రిపూట కర్ఫ్యూ ఏమి ఉపయోగం ఉండదని, ప్రజలకు సేవచేసే జిల్లా యంత్రాంగం,ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు,మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు మరియు సిబ్బంది,పోలీసులు, వైద్య సిబ్బంది, ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులు కరోనా బారినపడి ప్రజలతోపాటుగా ప్రాణాలుమీదకు తెచ్చుకుంటున్నారని, ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించినా పట్టణంలో ప్రధాన కేంద్రాలైన గంటస్థంభం పెద్ద మార్కెట్,కోట జంక్షన్, రైతుబజార్లు,కాకుండా వివిధ ప్రధాన కూడళ్లలో ప్రజలు గుమిగూడి ఉంటున్నందున ప్రజలంతా అవస్థలు పడుతున్నారన్నారు. ఇటువంటి తరుణంలో లాక్ డౌన్ ను విధిస్తే గాని ఉదృతంగా పెరుగుతున్న కరోనాను అరికట్టలేమని అన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలందరూ కారోనాపై అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని,ప్రతీఒక్కరూ మాస్కులు ధరించాలని,ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని అన్నారు.    ఈ విపత్కర పరిస్థితులను ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ గాని, 144 సెక్షన్ ను కఠినంగా వ్యవహరించాలని కోరారు.


70మందికి రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్

70మందికి రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్

పెన్ పవర్, తవణంపల్లి

 తవణంపల్లి మండల పరిధిలోని నల్లి శెట్టిపల్లి సచివాలయం నందు శుక్రవారం 70 మందికి రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి దత్తాత్రేయ తాసిల్దార్ హనుమంతు ఎంపీడీవో ధనలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో కరోనా కట్టడికి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సబ్బుతో తరచు చేతుల శుభ్రత శానిటైజర్ తో చేతుల శుభ్రత పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత ప్రతి ఒక్కరూ తన్నుతాను రక్షించుకొని కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ రచ్చబండ దగ్గర గుంపులు గుంపులుగా ఉండరాదని ప్రభుత్వ అధికారులు సూచనలు సలహాల మేరకు నిబంధనలు పాటించాలని 45 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందులు హెల్త్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం రెడ్డి సి హెచ్ వో రమాదేవి సూపర్వైజర్లు రాజశేఖర్ జయమ్మ  అపంచాయతీ కార్యదర్శి  రామకృష్ణ  వాలంటీర్లు ఆశ కార్యకర్తలు  సర్పంచి ఎంపీటీసీ లు పాల్గొన్నారు.

లలితనగర్ లో వృద్ధురాలు మెడలో చైన్ స్నాచర్లు బంగారం చోరీ...

 లలితనగర్ లో వృద్ధురాలు మెడలో చైన్ స్నాచర్లు  బంగారం చోరీ...

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక లలితానగర్ ఈ. ఎస్.ఐ హాస్పిటల్ రోడ్ నందు అక్కడ వృద్ధ మహిళ మెడలో బంగారం గుర్తు తెలియని దుండగులు ఇద్దరు ద్విచక్రవాహనంపై అటుగా రోడ్ దాటుతున్న వృద్ధురాలు బంగారం అపహహరించుకుని పరార్ అయ్యారు.వృద్ధురాలు కిందపడి గాయాలు పాలయ్యింది.సి.సి ఫుటేజులు అక్కడ ఆప్రదేశం లో ఉన్నాయి అని వాటి ఆధారంగా ఆ దుండగులు ఎవరు అనేది 3 వ పట్టణ  పోలీసులు దర్యాప్తు లో తెలియాలని అక్కడ స్థానికులు తెలపడం జరిగింది.

మానవ సేవే మాధవ సేవ అంటున్న దళారులను నమ్మకండి

 మానవ సేవే మాధవ సేవ అంటున్న దళారులను నమ్మకండి

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రోనా బారిన పడి మృతిచెందిన వారిని ఆసరాగా చేసుకుని మృతుని బందువులు నుంచి అక్రమ దోపిడికు గురౌతున్నారని, ఇకపై ఆటువంటివి పునరావృతం కాకూడదని రాజమహేంద్రవరం వైస్సార్సీపీ సిటీ కొ ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు.రాజమహేంద్రవరం నగరంలో ప్రతి ఒక్కరికి నేను అండగా ఉన్నానని,  వైఎస్ఆర్సిపి పార్టీ మీకు తోడుగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,  శానిటైజర్ 100% వాడాలని  డాక్టర్ ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు.  రాజమహేంద్రవరం స్థానిక ఏ వి అప్పారావు రోడ్డు ఆకుల సత్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  కరోనా  వైరస్ సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతుందని కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకున్న ఆకుల సత్యనారాయణ తెలుపరు.కోవిడ్ వైరస్ వచ్చి ఎవరైనా మృతి చెందితే అయ్యే ఖర్చు  వైఎస్సార్సీపీ పార్టీ తరఫున మేమే ఖర్చు పెడతామన్నారు.కైలాస భూమిలో ఎవరైనా ఎక్కువ తీసుకుంటే మాకు తెలియపరచాలని ఆయన అన్నారు.తోరలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాము అని,పట్టపగలు వెంకట్రావు వారితో సంప్రదింపులు జరపడం ఆయన కూడా ముందుకు రావడం జరిగింది అని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంత్యక్రియలు(దహన సంస్కారాలు)  నిర్వహించుకునే వారు స్వల్ప ఖర్చు మాత్రమే అని ఆయన వివరాలు ఈ సంధర్భంగా తెలియ జేశారు.ఈ సమావేశంలో రాజమహేంద్రవరం నగర వైస్సార్సీపీ అధ్యక్షులు నందెపు శ్రీను,మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీను,మహిళ నాయకురాలు ఉమా మహేశ్వరి,వైస్సార్సీపీ ఇంచార్జి గెడ్డం అనిల్,తదితరులు పాల్గొన్నారు.

కోనసీమ తిరుపతి ఆలయంలో కరోనా కలవరం

కోనసీమ తిరుపతి ఆలయంలో కరోనా కలవరం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు  నిత్యం భక్తులతో రద్దీగా ఉండే వాడపల్లి దైవ క్షేత్రం కరోనా మహమ్మారి సెకండ్ వే  విజృంభన కారణంగా ఆలయ దర్శనాలు భక్తులకు కుదించారు  అయినా ఆలయ అర్చకులలో  ఒకరు కు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా మిగిలిన అర్చకులను హోమ్  ఐ సొల్యూషన్ ఉండవలసిందిగా కోరారు అందువలన వాడపల్లి వెంకన్న దర్శనానికి 1.05.2021 నుండి8.05.2021 వరకు ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించబోమని   ఆలయ ఈవో చెప్పడం జరిగినది.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...