Followers

గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులు,  పౌష్టికాహారం, పండ్లు పంపిణీ 





49వార్డులో గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులు, 

పౌష్టికాహారం, పండ్లు పంపిణీ 

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్

 

49వ వార్డు,కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజు  సూచన మేరకు 49వ వార్డ్  వైస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థి  అల్లు శంకర్రావు  ఆధ్వర్యంలో ఏ ఎస్ ఎస్ ఆర్  నగర్ సచివాలయంలో  ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజు  చేతులు మీదుగా గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం మరియు 5రకాల పండ్లుపంపిణి చేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులుఆర్. పి. నాయుడు,  చిరికి వెంకటరావు, విత్తనాలు శివ మరియు వైస్సార్సీపీ బూత్  ఇంచార్జిలు ,మహిళా నాయకులు,సీనియర్ నాయకులు మరియు  కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


 

 



 

టీడీపీ దుకాణం మూసే సమయం దగ్గరపడింది







టీడీపీ దుకాణం మూసే సమయం దగ్గరపడింది

 

బ్యూరో రిపోర్ట్ విశాఖపట్నం, పెన్ పవర్

 

 

టీడీపీ కాస్త జూమ్ పార్టీ గా తయారైందని త్వరలోనే టీడీపీ పూర్తి స్థాయి లో ఏపీ లో మూత పడుతోందని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.      బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి    జగన్మోహనరెడ్డి కి పబ్లిసిటీ వద్దు. పని మాత్రమే కావాలి. కరోనా తో సహ జీవనం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి తొలి రోజుల్లో నే చెబితే దానిని కూడా టీడీపీ నేతలు వెటకారంగా విమర్శించారు. ఇప్పుడు దేశంలో వున్న అన్ని రాష్ట్రాల     ముఖ్యమంత్రులు తో పాటు దేశ ప్రధాని కూడా సహజీవనం చేయాలని చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఈ విషయమై ఏమి సమాదానం చెబుతారు. కరోనా వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి,రైతులు సంక్షేమం తదితర అన్ని అంశాలు లో మిగతా రాష్ట్రాల కంటే ఏపీ నే ముందు గా శ్రద్ధ తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ముందు చూపు తోనే ఇది సాధ్యమైంది. బాదితులను కొన్ని చానల్స్ ప్రేరేపించి మాట్లాడించే పరిస్థితి ఎందుకు అని విమర్శించారు. ప్రజల లో భయం సృష్టించే ప్రయత్నం చేయడం తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫాలీమార్స్ కంపెనీ అక్కడ వుండాలా వద్దా అనేది టీడీపీ నేతలు స్పష్టం గా చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ పట్నం లో పంచ భూతాలు ని సైతం టీడీపీ నేతలు దోచుకున్నారు. వైసిపీ వారికి అలాంటి అవసరం లేదన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ని ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు వైసిపీ పై విమర్శలు చేయడం సరి కాదన్నారు. ఎల్జీ ఫాలీమార్స్ వంటి పెద్ద దుర్ఘటన జరిగితే టీడీపీ నేతలు ఎక్కడున్నా రు. బాద్యత లేదా?ప్రాణ భయం తో కరోనా కు భయపడి ఇళ్ళ లో కూర్చుని స్టేట్ మెంట్ లు ఇస్తే తాము స్పందించాలా?రాష్ట్రం లో టీడీపీ పూర్తి స్థాయి లో కనుమరుగై పోయింది. టీడీపీ కేవలం జామ్ పార్టీ గా మాత్రమే మిగిలి పోయింది. 

రాష్ట్ర దేశ వ్యాప్తంగా కరోనా తో పోరాటం చేస్తుంది.  ఫాలీమార్స్ ఘటన బాధాకరం. దుర్ఘటన తెలిసిన తక్షణమే జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ప్రజల ని రక్షించేందుకు,ఆందోళన తగ్గించేందుకు కృషి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విశాఖ చేరుకుని అధికారులు ని అప్రమత్తం చేశారు. మంత్రులు ని ఫాలీమార్స్ బాదిత గ్రామాల లో పర్యటించమని ఆదేశాలు ఇచ్చారు. నష్టపరిహారం ప్రకటన చేశారు. ఫాలీమార్స్ బాదిత గ్రామాల లో సాదరణ పరిస్థితి నెలకొల్పేలా చర్యలు తీసుకున్నాం. అదే గ్రామాలలో మంత్రులు బస చేశాం. అవగాహన లోపంతో కొంత మంది కి లక్ష కాకుండా తక్కువ ఇవ్వడం ని సరిచేశాం. అర్హత కలిగిన బాదితులందరికీ జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లింపు చేస్తున్నాం.ప్రతి ఒక్కరికి పది వేలు రూపాయలు పంపిణీ చేస్తున్నాం. అయిదు గ్రామాల ప్రజలే కాకుండా వేరెవ్వరైనా బారిన పడితే వారి వివరాలు కూడా సేకరిస్తున్నాం. ప్రతి పక్ష పార్టీ లు,అనుబంద మీడియా సంస్థలు,వారి కి వంత పాడే వారి మూర్ఖత్వాన్ని మార్చలేం.టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తన పై తప్పు డు ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. జగన్మోహనరెడ్డి ఫాలీమార్స్ ప్రతినిధులు తో విమానాశ్రయం లో   ఏకాంతం గా మాట్లాడారనడం సబబు కాదు అని అన్నారు.


 

 




 

Attachments area

 


 



 



త్వరలో జిల్లా కేంద్రాలకు రైట్ రైట్..


త్వరలో జిల్లా కేంద్రాలకు రైట్ రైట్..



భౌతిక దూరంతో   సిద్దం అవుతున్న బస్సులు.



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవన్) 


త్వరలో  జిల్లా కేంద్రాలకు  బస్సు సర్వీసులను  పునరుద్ధరించేందుకు  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  ఏర్పాట్లు చేస్తుంది.కోవిడ్_19  ఆంక్షలు  నిబంధనలు  పాటిస్తూ  ప్రజా రవాణాకు  బస్సులు  నడపాలని  నిర్ణయించుకుంది. కరోనా లాక్ డౌన్  నేపథ్యంలో  రవాణా  స్తంభించిపోయింది. ఒకవైపు కరోనా   మహమ్మారి  విలయ తాండవం ఆడుతుంది. ప్రజలను కట్టడి చేస్తూ  అంచలంచలుగా  రవాణా వ్యవస్థను  నడపాలని  ప్రభుత్వం చర్యలు  చేపట్టింది. మొదటి దశలో  జిల్లా కేంద్రాలకు  పరిమితి స్టాఫ్ లతో  ఆల్ట్రా డీలక్స్  శమీ లగ్జరీ సర్వీసులను  నడపనున్నారు   ఆర్టీసీ  బస్సులో కరోనా  నిబంధనలు   అమలు చేసేందుకు  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మునుపటి వలె  బస్సు రాగానే   గొఱ్ఱెల మందల  ఎక్కి పోవటానికి వీలులేదు. కౌంటర్ లో టికెట్లు తీసుకుని  ఎవరి సీట్లో వారు కూర్చోవడానికి  వీలు కల్పిస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో మూడు వరుసల సింగిల్ సీట్లను ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఆల్ట్రా  డీలక్స్  లో మూడు సీట్లలో మధ్య సీట్లను నిర్వహిస్తున్నారు ఇద్దరు సీట్లలో ఒక సీటు కె అవకాశం ఇస్తున్నారు. కూర్చునే సీట్లకు నంబర్లు వేస్తున్నారు  మినహాయించిన వాటికి   ఇంటూ మార్క్ వేస్తున్నారు.  ప్రభుత్వం   గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే   జిల్లా కేంద్రాలకు  ఆర్టీసీ సర్వీసులు  ప్రారంభం కానున్నాయి.


ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకోలు


 



వలస కార్మికుల విషయంలో స్వార్ధ రాజకీయ నాయకులు ఏమైపోయారు??

 

 

స్వస్థలాలకు చేర్చేందుకు స్వార్ధ రాజకీయ నాయకులు ఏమైపోయారు?

 

మండుటెండలో కాలినడకన, సైకిళ్లపై వందల కిలోమీటర్ల ప్రయాణం

 

ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకోలు

 

విజయనగరం  ప్రతినిధి ,  పెన్ పవర్ :

 

లాక్‌డౌన్‌ దెబ్బకు వలస కార్మికుల బతుకులు రోడ్డునపడ్డాయి. స్వస్థలాలకు వెళ్లేందుకు వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. జాతీయ రహదారుల వెంబడి మండుటెండను సైతం లెక్కచేయకుండా కాలినడకన కొందరు, సైకిళ్లపై మరికొందరు తమ సొంత రాష్ట్రాలకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను చూసేవారి హదయాలను కలచివేస్తున్నాయి. రోజు వారీ వార్తలు టీవీ లో చూస్తున్నాం, పెయింటింగ్‌ పనుల నిమిత్తం ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన వలస కార్మికులు  చింతలపూడి నుంచి కాలినడకన విజయవాడ బయలుదేరారు. విజయవాడ చేరుకుంటే అక్కడి నుంచి రైలులో ఉత్తరప్రదేశ్‌ వెళ్లేందుకు అనుమతి దొరుకుతుందనే ఆశతో బయలుదేరిన ఆ బృందం మంగళవారం మధ్యాహ్నం ఏలూరు నగరంలోని సిఆర్‌.రెడ్డి కళాశాల వద్ద ఓ చెట్టు నీడలో భోజనం చేస్తూ కనిపించారు. అలాగే జార్ఖండ్‌కు చెందిన రైల్వే కంకర పనులు చేసే ఐదుగురు కార్మికులు చెన్నై నుంచి సైకిళ్లపై జార్ఖండ్‌కు వెళుతూ బైపాస్‌ రోడ్డులో ఓ చెట్టు కింద నిద్రపోతూ కనిపించారు. 12 రోజుల క్రితం సైకిళ్లపై చెన్నై నుంచి బయలుదేరినట్లు వారు తెలిపారు. వారిపక్కన ఉన్న భోజనం ప్యాకెట్లను చూస్తే సైకిల్‌ తొక్కి అలసిపోయి, భోజనం తినకుండానే పడుకున్నట్లు తెలుస్తుంది. అలాగే తమిళనాడులోని టైర్ల కంపెనీలో పనిచేసే ఓ ఇద్దరు వలస కార్మికులు సొంత రాష్ట్రం చేరాలనే పట్టుదలతో ఏకంగా రెండు కొత్త సైకిళ్లను కొనుగోలు చేసి ఒరిస్సా బయలుదేరారు. వారు కూడా జాతీయ రహదారిపై ఆశ్రం ఆసుపత్రి సమీపంలో ఓ చెట్టు నీడన భోజనం చేస్తూ కనిపించారు. ఐదు రోజుల క్రితం చెన్నై నుంచి బయలుదేరామని వారు తెలిపారు. ఇలా ఎక్కడ చూసినా వలస కార్మికుల వెతలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటివారిని సొంత రాష్ట్రాలకు పంపించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఓ పక్క ప్రభుత్వాలు చెబుతుంటే సొంత రాష్ట్రాలకు చేరేందుకు కార్మికులు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బతుకు భారమై ఉన్న సొంత ఊరిని సొంత జిల్లాను వదిలి పక్క రాష్ట్రానికి పక్క జిల్లాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి చూస్తే కన్నీరు వస్తుంది.పిల్లలను కన్న తల్లి దండ్రులు, అత్తమామలు ను వదిలి కడుపు నింపుకోవడానికి ఆ కుటుంబం కడుపు నింపడానికి పిల్లల జీవితాలు బాగుపడాలని ఆశతో వలస కార్మికులకు కష్టకాలంలో ఓట్లు అడిగే వాళ్ళ పై ఆధారపడి బతికే స్వార్థ రాజకీయ నాయకులకు గుర్తు రాలేదని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికులు ఓట్లు కావాలంటే మాత్రం ప్రత్యేకమైన బస్సులు కార్లు లో సొంత ఊర్లకు తీసుకు వస్తారు కానీ నీ కరోనా కష్టకాలంలో ఫోన్ చేసి వారి బాగోగులు అడిగిన ఒక్క నాయకుడు కూడా లేడు. అమాయక ప్రజల అమాయకత్వంతో స్వార్ధ రాజకీయ నాయకుల ఆలోచనతో వాళ్ళని మోసగించి వాళ్ళు వేసే ఓట్లతో కేవలం బతికే నాయకులు కనీసం మేము గుర్తు రాలేదని ఓట్లు వేసే వలస కార్మికులు చీదరించుకునే పరిస్థితి.అదే నాయకుల పిల్లల కానీ, బంధువుల కానీ ఎక్కడైనా ఉంటే తీసుకువచ్చే వీరు మాపై ఇంత వివక్షత చూపించడం చాలా దారుణమని వలస కార్మికుల తో చేసిన సంభాషణలో వలస కార్మికులు రాజ్ కుమార్ తో చెప్పడం జరిగింది.కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటూ వస్తున్న వారిని మాత్రం స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకుని వాళ్ళ ఆకలి తీరుస్తూ వారి దాహాన్ని తీరుస్తూ వారు ఇచ్చిన మనోధైర్యంతో  ముందుకు నడిచేలా చేశాయని వలస కార్మికులు చెప్పుకొచ్చారు.కొంత మంది దగ్గర లాక్ దాని మొదలు తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ల దగ్గర ఉన్న సొమ్మ తో తాము తెచ్చుకొని తిన్నామని ఆ తర్వాత డబ్బులు అయిపోయాయి అని వలస  ప్రాంతంలోనే ఉంటే తన పరిస్థితి ఏ విధంగా మారుతుందో తెలియని పరిస్థితిలో కనీసం కష్టకాలంలో సొంత ఊర్లకు పోదామంటే సరిపడా డబ్బు లేని పోనీ పరిస్థితి, పనిచేసిన కాంట్రాక్టర్ ను అడిగితే వాళ్లు కూడా చేతులెత్తేసిన పరిస్థితి, కాలినడకన నడవలేని పరిస్థితి అదే విధంగా లారీలకు అధిక సంఖ్యలో సొమ్ము చెల్లించుకో లేని పరిస్థితి లో కనీసం స్వార్ధ రాజకీయ నాయకులు ఆలోచించక పోవడం చాలా దారుణమైన విషయమని వలస కార్మికులు రాజ్ కుమార్ తో చేసిన సంభాషణల్లో పేర్కొన్నారు.ఏది ఏమైనా బతుకుబండిని లాగించడానికి  పోయిన వలస కార్మికుల ఓట్ల పై ఆధారపడి బతికే స్వార్థ రాజకీయ నాయకులారా  మీరు మారకుంటే ప్రభుత్వాలకు ప్రమాదం ఉంది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వలస కార్మికుల రాకపోకలపై వాళ్ళ జీవన పరిస్థితులు వారి బాగోగులు ఎంతైనా విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని వారి కష్టాలను తీర్చుకుంటే ప్రభుత్వాలు ప్రమాద బారిన పడే అవకాశం లేకపోలేదు.

మెరకముడిదాం అధికారుల కష్టం వృధా అవుతుందా


మెరకముడిదాం అధికారుల కష్టం వృధా అవుతుందా?

 

మెరకముడిదాం ,  పెన్ పవర్ :

 

మార్చి 23 నుంచి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచి ప్రజల నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో వైద్య ,ఆరోగ్యశాఖ ,పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ,పారిశుద్ధ్య సిబ్బంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛంద సేవా ప్రతినిధులు ఎంత మొత్తుకున్నా ఇప్పటికీ 90% ప్రజల్లో మార్పు రాలేదు అని చెప్పవచ్చు.అవసరం ఉన్నా లేకపోయినా రోడ్లమీద తిరగడం మాస్కులు పెట్టుకోకపోవడం సామాజిక దూరం పాటించకపోవడం గుంపులు గుంపులుగా మీటింగ్ పెట్టడం జరుగుతుంది.మరికొంతమంది అయితే రకరకాల ఆటలు ఒకే దగ్గర చేరి కాలక్షేపం చేస్తూ మెరకముడిదాం అధికారుల కష్టాన్ని గుర్తించడం లేదు. మనం బాగుండాలని మన కుటుంబాలు బాగుండాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ఇతరులు ఎంత కష్టపడుతున్న ప్రజలకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో చలనం రాలేదు అని చెప్పవచ్చు.ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే అధికారులు ఇంకా ప్రజలకు అవగాహన కల్పించే అవసరం ఉండదు.ఎప్పటికైనా ప్రజలు మారి ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి సహకరిస్తే కనీసం ఈ నెల చివరి కైనా పూర్తిగా జూన్ మొదటి నుంచి ఎవరి పని వారు చేసుకునే అవకాశం ఉంటుంది.లేకుంటే మరో ఆరు నెలల పాటు ఇదే విధానం కొనసాగి జీవనోపాధి కోల్పోయే ఎందరో పేదల ఆకలి చూడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మారుద్దాం జాగ్రత్తలు పాటిద్దాం.

కిరాణా షాప్ లలో తనిఖీలు 


కిరాణా షాప్ లలో తనిఖీలు 

 

కిర్లంపూడి, పెన్ పవర్

 

 మండలం లోని

చిల్లంగి ,కిర్లంపూడి లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు తూనికలు, కొలతల శాఖ  అధి కారులు కిర్లంపూడి ,చిల్లంగి గ్రామాల్లో లో గురువారం ఉదయం పలు

 కిరాణా షాప్ లలో తనిఖీలు నిర్వహించారు. షాపుల్లో  అధికారులు పలు వస్తువులు పరిశీలించి ప్రభుత్వం ధర నిర్ణయం మేరకు అమ్మ కపు ధర, తేదీ, ఉందో లేదో అని  పరిశీలించారు. మరియు ప్రతి వస్తువు పైన కావలసిన డీటెయిల్స్ ఉందా లేదా అని పరిశీలించారు .ఈ దాడుల్లో బియ్యం బస్తాలు, టి పొడి, నెయ్యి ప్యాకెట్లపై అమ్మకం ధర తో పాటు కన్జ్యూమర్ డీటెయిల్స్ లేకపోవడంతో మరియు తయారు తేదీ లేకపోవడంతో తేడాలు గుర్తించామని, అలాగే కన్జ్యూమర్ డీటెయిల్స్ ఉండాలని తుని తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ జి .వెంకట ప్రసాద్ తెలిపారు .ఈ దాడుల్లో మూడు కేసులు నమోదు చేశామని బియ్యం, నెయ్యి, టీ పొడి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో తమతో పాటు రాజమహేంద్రవరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి టి. డి రత్న కుమార్, తాసిల్దార్ కె ,విజయ్ కుమార్ ,సిబ్బంది పాల్గొన్నారు.

క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో పేదలకు సహాయం





క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో పేదలకు సహాయం

 

అనకాపల్లి ,  పెన్ పవర్

 

గొలగాం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు  లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పది కేజీల బియ్యం ఐదు రకాల కాయగూరలు, కంది పప్పు ,చింతపండు, ఆయిల్ ప్యాకెట్, గోధుమపిండి ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్ నెలసరి పడే నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. పంచాయతీ ఎల్లారం వంద మందికి వృద్ధులకు వితంతువులకు ఎంపీటీసీ సభ్యులు నారిపిన్ని చంద్రశేఖర్ అధ్యక్షతన పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో వైస్సార్ సిపి నాయకులు రేబాక ఇంద్రకుమార్, ఉడతా రాముడు,  కరుణాకర్పెన్నడ రాము,విరుగులసంతోష్, చోడ్ చంద్రపల్,రయవరపువరప్రసద్,కసిపల్లిసంతోష్, జ్జామిత్రినద్, కసిపల్లిశ్రిను, వీరుగుల వెంకట అప్పారావు,చొడే అరుణ్,ఒంటుపు ఈశ్వరరావు, డేనియల్ మరియు కొప్పాక జై భీమ్ సేన సేవా సంఘo యువత పెద్దలు  పాల్గొన్నారు.

 

 



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...